తాడిపత్రి మున్సిపల్ ఆఫీసును సందర్శించారు చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుకు నిరసగా ఒంగి ఒంగి దండాలు పెడుతూ అగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులందిరికీ శనివారం రోజు సమాచారం అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేతి పెద్దా రెడ్డితో సహా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో కరోనా థర్డ్ వేవ్ పట్ల ప్రజలకు అవగాహాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఎమ్మెల్యేతో సమీక్ష సమావేశం అనంతరం అధికారులు ర్యాలీలో పాల్గొని అటు నుంచే అటు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక ర్యాలీ అనంతరం జేసీ మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు. కౌన్సిలర్లతో 12.30 గంటల వరకు వెయిట్ చూస్తూ ఆఫీసులోనే కూర్చున్నారు. ఎంతకు వారు రాలేదు. ఇక మున్సిపల్ కమిషనర్ ర్యాలీ అనంతరం మధ్యాహ్నం సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుకున్న మున్సిపల్ సిబ్బంది సాయంత్రం కొంతమంది వచ్చారు. దీంతో వచ్చిన కొందరికి ఒంగి ఒంగి నమస్కారాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు.
అసలు ఎవరి పర్మిషన్‌తో మున్సిపల్ కమిషనర్ సెలవులు పెట్టుకుంటున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఇక జేసీ అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక మున్సిపల్ కమిషనర్ వచ్చేదాక ఇక్క్డడి నుంచి కదిలేదే లేదంటూ తేల్చి చెప్పారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ భోజనం చేసి రాత్రంత నిద్రకు ఉపక్రమించారు. దీంతో ఎంతకు కమిషనర్ రాకపోవటంతో తీవ్ర అగ్రహానికి లోనయ్యాడు. దీంతో అనంతరం 26 మంది మున్సిపల్ సిబ్బంది తీరుపై కనిపించటంలేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జేసీ. ఇక స్థానికంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.