JC Diwakar Reddy: తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లాంటి వారు జేసీ దివాకర్‌రెడ్డి. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. పక్క పార్టీ నాయకులపై ప్రశంసల జల్లు కురిపించినా.. సొంత పార్టీలోని లోటుపాట్లని ఎత్తి చూపినా ఆయనకు ఆయనే సాటి. దశాబ్ధాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పెద్ద పెద్ద పదవులు సొంతం చేసుకున్నారాయన. 2019 ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత రాజకీయాలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడపాదడపా ఇంటర్వ్యూలతో జనం ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాను రాజకీయాలనుంచి వైదొలుగుతున్నట్లు దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిగిలిన జీవితాన్ని వ్యవసాయం చేసుకుంటూ గడుపుతానని అన్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గెస్ట్ హౌస్‌లో ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతూ.. చేతనైనంత ప్రజలకు సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తానని అన్నారు. మరి, జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ సన్యాసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ ఫోటో విషయంలో పవన్ ఫ్యాన్స్ కి సమాధానం ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.