ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడివేడిగా సాగుతున్నాయి. అధికార , ప్రతి పక్షాల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. ఇంతకాలం తెదేపా, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతు వస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి జనసేన పార్టీ కూడా అధికార వైసీపీ పై విమర్శనాస్త్రాలు సందిస్తూ దూకుడు పెంచింది. ఈక్రమంలోనే ప్రభుత్వం పై పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పవన్.. కార్టూన్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు ధర్నాలకు దిగుతున్నారు. ఈక్రమంలో గుడివాడలో మాజీ మంత్రి వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలంటూ జనసేన కార్యకర్తలు కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా .. తాము ఏం నేరం చేశామంటూ జనసేన కార్యకర్తలు ఎదురు తిరిాగరు. గుంతలు గుంతలు గాఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే దారిలో జనసేన శ్రేణులు ధర్నకు దిగారు. మొద్దు నిద్రపోతున్న సీఎం జగన్ మేల్కోవాలంటూ నినాదాలు చేశారు. జనసేన కార్యకర్తలను కొడాలి నాని ఇంటికి వెళ్లకుండా పోలీసులు శత విధాలా ప్రయత్నించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.