ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించి.. దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇలానే గత ప్రభుత్వ పాలనకు, వైసీపీ పరిపాలనకు గల తేడాలను వివరిస్తూ ప్రజల్లోకి పలు కార్యక్రమాలు తీసుకెళ్లారు. తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించి.. దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అలానే గత ప్రభుత్వ పాలనకు, వైసీపీ పరిపాలనకు గల తేడాలను వివరిస్తూ ప్రజల్లోకి పలు కార్యక్రమాలు తీసుకెళ్లారు. తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. శుక్రవారం ‘జగనన్నే మా భవిష్యత్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలకు మరింత చేరువయ్యేలా ఈ కార్యక్రమాని రూపొందించారు.
ఏపీ వ్యాప్తంగా “జగనన్నే మా భవిష్యత్తు” అనే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా పీపుల సర్వేలో 7 లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో పాటు 1.65 కోట్ల గడపలకు వెళ్లనున్నారు. అలానే ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజల స్పందనను నమోదు చేసుకుంటారు. ఇంటి యజమానికి అంగీకారంతోనే ఇంటి తలుపుకి ‘మా నమ్మకం నువ్వే జగనన్న స్టికర్’ ను అతికిస్తారు. ఇదే సమయంలో 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి జగనన్న సందేశం అందిస్తారు. “జగనన్నే మా నమ్మకం” అనే నినాదం ప్రజల నుంచి వచ్చినదని వైసీపీ నాయకులు అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఎంపీ సంజీవ్ కుమార్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొని మెగా పీపుల్ సర్వే కార్యక్రమం గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిష్పక్షపాతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, ఆర్థిక పురోగతి కోసం అనేక పథకాలు అందిస్తున్న ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుదని వైసీపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు. ” నేడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 20 వరకు కొనసాగుతుంది. జగన్ మాత్రమే మా భవిష్యత్ అనే నినాదంతో ముందుకు వెళ్తాము. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ‘జగనన్నే మా భవిష్యత్’ ప్రోగ్రామ్ ను చేపడుతున్నాము.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నేర్చింది. మేనిపెస్టో లోని ప్రతి అంశాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చింది. నాలుగేళ్ళ పాలన ముగించుకుని ఐదో ఏట అడుగుపెడుతున్న వేళ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది” అని మంత్రి బొత్సా సత్యనారయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. మరి.. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ కొత్త ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.