ప్రశాంత్ కిషోర్.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఇయనకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడానికి వెనక ప్రధానంగా ఉన్నవి పీకే వ్యూహాలే అనే విషయం అందిరికి తెలిసిందే. జగన్ భారీ విజయం తర్వాత పీకేకు దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు పీకేను తమ వ్యూహకర్తగా నియమించుకున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్ కూడా ఉంది. 2024 జనరల్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
2018 ముందు వరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీని.. పూర్తిగా చావగొట్టి చేవులు మూసింది. కానీ ఆ తర్వాత రాష్ట్రంలో అనూహ్యంగా బీజేపీ బలం పుంజుకోవడం.. అడపదడపా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు భారీ షాకులు ఇస్తుండటంతో.. ఇక కేసీఆర్ కూడా పీకే సాయం అభ్యర్థించక తప్పలేదట. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మరోసారి అధికారంలోకి రావడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. వాటిల్లో ఒకటి పీకేను వ్యూహకర్తగా నియమించుకోవడం. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : ప్రశాంత్ కిషోర్ బృందంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ?
రాజ్యంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు.. పీకే డైరెక్షనే
బడ్జెట్ పై స్పందిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తాజాగా రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అలజడి రేపిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనక ఎవరున్నారు అని ఆరా తీస్తే.. వారికి కనిపించిన పేరు పీకే. గతంలో ఢిల్లీ టూర్‌లో పీకే టీంతో మాట్లాడి ఫైనల్ చేసుకున్నారట కేసీఆర్. తర్వాత వాళ్లు ప్రగతి భవన్‌కు వచ్చి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారట. అంతర్గతంగా సర్వే కూడా చేశారని సమాచారం. ఇప్పుడు కేసీఆర్ పీకే టీం సలహాలతోనే విజృంభించడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను సొంత పార్టీ వారు సమర్థిస్తారు. వ్యతిరేకించేవారు విమర్శిస్తారు. కానీ సమాజంలో ఓ చీలిక అయితే వస్తుంది.
తాను పని చేయాలనుకున్న పార్టీకి మొదటగా పీకే టీం చేసే మేలు.. ఇచ్చే ఫార్ములా ఇదే. ఏపీలో ఓ కులంపై వ్యతిరేకతను ప్రజల్లో ఎలా రెచ్చగొట్టారో.. ఇప్పుడు తెలంగాణలో ఆ స్థానంలోకి రాజ్యాంగాన్ని తెచ్చే ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉండే వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని సమాజంలో చీలికలు తెచ్చి రాజకీయంగా ఉపయోగపడేలా చేయడమే పీకే ప్లాన్. కేసీఆర్ ఇప్పుడు ఆ పీకే ప్లాన్ ప్రకారమే రంగంలోకి దిగారని చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు.. విమర్శలు.. తిట్లు అందుకేనని అంటున్నారు. పీకే ప్లాన్ ప్రకారమే కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పన్నితే ఇక తెలంగాణలో అలజడి ఖాయమని అనుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.
ఇది కూడా చదవండి : వాళ్ళందరూ పార్టీ నుండి వెళ్ళిపోండి-రాహుల్ గాంధీ
భయపడుతున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
పీకే టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహకర్తగా పని చేయడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంతోషంగా ఉన్నప్పటికి.. ఎమ్మెల్యేలు మాత్రం అంత సంతృప్తిగా లేరట. ప్రశాంత్ కిశోర్ ఏదైనా పార్టీ గెలుపు కోసం పని చేస్తే.. ఆయన అనేక అంశాలపై దృష్టి పెడుతుంటారు. అందులో స్థానికంగా ఉన్న నేతలపై ఉండే వ్యతిరేకత అంశం కూడా ఒకటి. ప్రజల్లో ఎవరిపై సానకూలత ఉంది.. ఎవరిపై వ్యతిరేకత ఉంది అనే అంశంపై కూడా ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే చేస్తుందని.. ఆ సర్వేకు తగ్గట్టుగా అభ్యర్థులను మార్చాలని గట్టిగా పట్టుబడుతుందనే వాదన ఉంది.
గతంలో పీకే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఏపీలోనూ వైసీపీ నాయకత్వం ఆయన వద్దని చెప్పిన నేతలకు టికెట్లు ఇవ్వలేదని.. ఈ విషయంలో సీఎం జగన్ పీకేపై పూర్తి విశ్వాసం ఉంచారని సమాచారం. ఇక బెంగాల్‌లోనూ మమత బెనర్జీ ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారని.. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : బీజేపీ vs టీఆర్‌ఎస్.. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
ఒకవేళ తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పీకే పని చేస్తే.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలకు కోత పడటం ఖాయమనే చర్చ సాగుతోంది. మరోసారి కచ్చితంగా అధికారంలోకి రావాలంటే.. ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని పీకే పట్టుబడితే.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఇందుకు నో చెప్పకపోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగితే.. తమ పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉన్నట్టు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : వైఎస్ షర్మిల వ్యూహకర్తగా పీకే శిష్యురాలు
గత ఎన్నికల వేళ కూడా కేసీఆర్.. అభ్యర్థులను కాదు.. తనను చూసి ఓటు వేయాల్సిందిగా జనాలను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఆయా నేతల మీద నియోజకవర్గాల్లో వ్యతిరేకత అలానే ఉంటి.. వారికి రానున్న ఎన్నికల వేళ టికెట్లు ఇవ్వడం దాదాపు అసాధ్యం.. పీకే కూడా ఇదే మాట చెబితే ఇక ఆయా నేతల పరిస్థితి అంతే అనే మాటలు వినిపిస్తున్నాయి.