వందేళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు గత కొన్ని ఏళ్లుగా అన్ని పరాజయాలే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ వైభవం క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ఇక గత కొన్నేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ.. ఇటు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని సంప్రదించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్ రూపొందించారు. దాన్ని సోనియాకు అందజేశారు. దీనిపై నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు విస్తృతంగా చర్చించారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలు ఉన్నాయి. అవేంటంటే..
ఇది కూడా చదవండి: CM కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లిన పోలీసులు! స్పందించిన జగన్!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సిఫార్సు చేసినట్లు సమాచారం. అలా పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అధినేత్రి సోనియాకు సూచించారట. ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ చేసిన సిఫార్సు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి ఇంకా పీకే సేవలు అందిస్తున్నారు. ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం వచ్చే ఎన్నికల కోసం వైసీపీకి పని చేయడం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌తో పొత్తుకు సిఫార్సు చేశారంటే.. వైసీపీ ముఖ్య నేతల అనుమతి కూడా ఉండే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై జగన్‌కు నమ్మకం ఎక్కువే ఉంటుంది. మరి ఈ ప్రతిపాదన అసలు జగన్ దాకా వెళ్లింది.. వెళ్తే తను ఏం చెప్పాడు అనే దాని గురించి జోరుగా ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో వైరల్ గా మారిన కాన్వాయ్ ఘటన..వైసీపీ మాజీ మంత్రి క్షమాపణలు!ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ .. వైసీపీ ఓటు బ్యాంక్ ఒక్కటే అని ఇప్పటికి చాలా మంది భావిస్తారు. తెలంగాణ విషయం పక్కకు పెడితే.. అందరూ అనుకుంటున్నట్లుగా రాష్ట్ర విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ కి ఈ దుస్థితి రాలేదు.. కేవలం జగన్ పార్టీ పెట్టడం వల్లనే అనేది అందరూ అంతర్గతంగా అంగీకరించే విషయం. ఇప్పుడు జగన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ 2024 ఎన్నికల నాటికి.. వారు ఒకటి, రెండు శాతం వైసీపీకి దూరం జరిగినా.. ఆ ప్రభావం వైసీపీపై భారీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నింటి గురించి ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎలా చూసినా ప్రశాంత్ కిషోర్.. వైసీపీ అనుమతి లేకుండా కాంగ్రెస్‌కు పొత్తు ప్రతిపాదన చేయరని అంటున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం: హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్..
ఎందుకంటే సీఎం జగన్‌తో ప్రశాంత్ కు అంత సాన్నిహిత్యం ఉంది. అంటే వైసీపీ అధిష్టానానికి తెలిసే ఈ పొత్తు ప్రతిపాదన కాంగ్రెస్‌కు చేరి ఉంటుందని సమాచారం. అదే గనక నిజమయితే.. ఈ సారి ఏపీ రాజకీయాల్లో జగన్, కాంగ్రెస్ కలిసి ఎన్నికలకు వెళ్తాయన్నమాట. మరి దీనిపై ఢిల్లీ బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుంది.. అసలు కాంగ్రెస్‌తో పొత్తుకి జగన్ సిద్ధపడతాడా.. లేదా.. అనేది తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఎదురు చూడాలి. కాంగ్రెస్, వైసీపీ పొత్తుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.