ఏపీలో టీడీపీకి గత వైభవం రావాలంటే.. నందమూరి, నారా రెండు కుంబాలు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని టీడీపీ కేడర్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా నారా బ్రహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం పార్టీకి ఎంతో కలిసి వస్తుందని.. కేడర్ లో కూడా మునపటి ఉత్సాహం వచ్చి.. పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరో వైపు బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీ టీడీపీకి కలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాపడుతున్నారు.
ఇప్పటికే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం బ్రహ్మణి పాదయాత్ర చేపడితే బాగుంటుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున అభ్యర్థిసున్నారని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు బ్రహ్మణిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా.. ఎన్నికల బరిల నిలిపితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఓ పొలిటికల్ సర్కిళ్లల్లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి : టీడీపీలో ఊహించని మలుపు! రంగంలోకి బ్రహ్మణి!
అనంతపూరం జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఏళ్ల తరబడి ఇక్కడ టీడీపీనే విజయం సాధిస్తూ వస్తోంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. జగన్ ప్రభావం ఇంత బలంగా ఉన్నప్పటికి హిందూపూర్ లో మాత్రం టీడీపీ తరఫున బరిలో దిగిన బాలకృష్ణ విజయం సాధించారు.
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో హిందూపూర్ బరిలో టీడీపీ తరఫున బ్రహ్మణిని బరిలో నిలిపితే బాగుంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారట. హిందూపూర్ లో టీడీపీకి కేడర్ బలంగా ఉంది. పైగా నారా, నందమూరి ఆడపడుచు అయిన బ్రహ్మణిపై ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉంది. రెండు కుటుంబాలకు ఉన్న పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, నందమూరి కుటుంబంపై ప్రజల్లో ఉన్న అభిమానం వంటి అంశాలన్ని బ్రహ్మణికి కలసి వస్తాయని.. బ్రహ్మణి హిందూపూర్ లో పోటీ చేస్తే గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
గుడివాడ బరిలో బాలకృష్ణ..
ఇక బాలకృష్ణని గుడివాడ నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. వైసీపీ నేతల కొడాలి నానికి అన్ని విధాలుగా చెక్ పెట్టాలంటే.. గుడివాడలో బాలయ్యనే బరిలో దింపాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. గుడివాడలో బాలయ్య పోటీ చేస్తే.. నందమూరి అభిమానులతో పాటు.. కమ్మ సామాజిక వర్గం కూడా మద్దతుగా నిలుస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇలా చేస్తే అటు హిందూపూర్, ఇటు గుడివాడ రెండు కూడా టీడీపీ ఖాతాలోనే ఉంటాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి బ్రహ్మణి పోటీ చేస్తుందో లేదో తెలియాలి అంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.