కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా పార్టీలు ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. తాజాగా ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ 175 సీట్లు టార్గెట్ పెట్టుకుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ.. కాపు సామాజిక వర్గ ఓట్లని ఆకర్షించేందుకు ముద్రగడను పార్టీలోకి లాగే ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఏ పార్టీలోనూ చేరనని ముద్రగడ తెగేసి చెప్పడంతో వైసీపీ ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే వైసీపీ నాయకులు ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబును సంప్రదించినట్లు తెలుస్తుంది. “మీరు ముందుండి, మీ వెనుక నాన్న గారిని ఉండమని చెప్పండి” అంటూ వైసీపీ అడిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ముద్రగడ కుటుంబం వైసీపీలో చేరుతుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకి నై, జూనియర్ NTRకి సై.. తారక్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు..