సుమారు 21 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా.. పార్టీ స్థాపించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు. సుమారు 13 ఏళ్ల పాటు నిరంతరంగా శ్రమించి.. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాడు. 60 ఏళ్ల తెలంగాణ వాసుల కల సాకారం కావడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. రెండు సార్లు.. పోటీ చేసి.. విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా గెలిచారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూనే.. దేశ రాజకీయాల్లో చైతన్యం తేవాలి.. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే భారత రాష్ట్ర సమితిగా మార్చి.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నారు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతుంది.
కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా.. దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోసించాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఒక పార్టీ.. జాతీయ స్థాయి పార్టీగా పిలవబడాలంటే.. ఈసీ ముందుగా దాన్ని జాతీయ స్థాయి పార్టీగా గుర్తించాలి. అలా జరగాలంటే.. ఆ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఈసీ చెప్పిన నిబంధలను పాటిస్తూ.. ఓట్లు, సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఆప్.. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కనీస ఓట్లు సాధించి.. జాతీయ పార్టీగా ఆవిర్భవించనుంది. ఇక బీఆర్‌ఎస్ కూడా జాతీయ పార్టీగా మారాలంటే.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి.. సత్తా చాటాలి.
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన-1968 ప్రకారం..
వీటన్నింటిని పాటిస్తేనే.. ఒక పార్టీని జాతీయ స్థాయి పార్టీగా గుర్తిస్తారు. అయితే ఈ గుర్తింపు శాశ్వతంగా ఉండదు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి మారుతుంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్‌ఎస్ జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ముందుగా నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ పని చేయాలంటే.. కేసీఆర్.. దక్షిణాది రాష్ట్రాల్లోనే ముందుగా బీఆర్‌ఎస్‌ను బరిలోకి దింపాలి.
బీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయి పార్టీ అన్న గుర్తింపు రావాలంటే.. ముందుగా అది నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. కేసీఆర్‌కు సౌత్‌లోనే కాస్త ఎక్కువ పట్టు ఉంది. అందుకే ఆయన ముందుగా దక్షిణాది రాష్ట్రాలనే టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో కేసీఆర్ చూపు ముందుగా పక్క తెలుగు రాష్ట్రం ఏపీ మీదనే ఉంటుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమయిపోయంది. విజయవాడలో బీఆర్‌ఎస్ కార్యాలయం రెడీ అవుతోంది. త్వరలోనే.. కేసీఆర్.. ఏపీలో అడుగుపెట్టడం ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని.. కేసీఆర్ భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా చేశారని.. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిపే అభ్యర్థుల జాబితా తయారు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన బీఆర్‌ఎస్.. ఏపీలో పోటీ చేస్తే.. అది ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది.. ఎవరికి నష్టం కలిగిస్తుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే ఏపీలో బీజేపీ హవా అంతగా లేదు. అక్కడ బీజేపైకి వ్యతిరేకంగా పోటీ చేసే పరిస్థితులు కూడా లేవు. మరి ఇప్పుడు కేసీఆర్ బీజేపీ వ్యతిరేకతను పక్కన పెట్టి.. పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే బాధ్యతే ముఖ్యం అనుకుంటే.. ఆయన పోటీ.. ఇన్‌డైరెక్ట్‌గా వైసీపీ మీదనే ఉంటుంది. ఇప్పటివరకైతే.. ఇరు రాష్ట్రాల సీఎం మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు వైసీపీ నేతలు బీఆర్‌ఎస్ గురించి ఎలాంటి విమర్శలు చేసిన దఖలాలు లేవు. మరి భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అంతేకాక.. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో ప్రధానంగా ప్రభావం పడేది విపక్షాల పైనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో వైసీపీకి స్ధిరమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా విపక్షాలు రానున్న ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో బీఆర్‌ఎస్ ఎంట్రీ ఇస్తే.. ఇప్పటికే ఏపీలో ఉన్న విపక్షాలకు తోడు.. ఇప్పుడు బీఆర్‌ఎస్ కూడా ఆ వ్యతిరేక ఓటును పంచుకోవాల్సి వస్తుంది. ఇది కచ్చితంగా విపక్షాలపై ప్రభావం చూపించే అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ముందు ముందు ఏపీలో బీఆర్‌ఎస్ పాత్ర ఎలా ఉండబోతుంది.. ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారనుందో తెలియాంటే.. మరికొంత సమయం వేచి చూడాలి. మరి ఏపీలో బీఆర్‌ఎస్ పోటీ ఎవరికి కలిసి వస్తుందని భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.