మంత్రి కొడాలి నాని.. ఏపీ రాజకీయాల్లో ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. పార్టీలకతీతంగా కొడాలి నానికి అభిమానులున్నారు. ఇక నాని దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే.. తనదైన స్టైల్లో వెళ్లిపోతుంటారు కొడాలి నాని. ఇక చంద్రబాబను, టీడీపీ నేతలను విమర్శించడంలో కొడాలి నాని ముందుంటారు. సీఎం జగన్ ని ఎవరు ఏమన్నా.. కొడాలి నాని రంగంలోకి దిగుతారు. అవతలి వ్యక్తి ఎంతటి వారైనా ఆయనకు అనవసరం. తనదైన స్టైల్లో నోటికి పని చెప్పి.. వారికి కౌంటర్ ఇస్తారు. పైగా తనను బూతుల మంత్రి, పేకాట మంత్రి అన్నా పట్టించుకోను అని కొడాలి నాని గతంలో స్వయంగా తెలిపారు.
ఇక ప్రస్తుతం ఏపీలో టీడీపీకి సీఎం జగన్ తో పాటు.. కొడాలి నాని కూడా పక్కలో బల్లెంగా తయారయ్యారు. ప్రభుత్వం మీద కానీ, సీఎంని కానీ ఒక్క మాట అంటే చాలు కొడాలి నాని రంగంలోకి దిగి నోటికి పని చెప్తారు. చాలా మంది నాని వ్యాఖ్యలకు జడిసి.. దూరంగా ఉంటారు. ఈ క్రమంలో టీడీపీ.. సీఎం జగన్ తో పాటు కొడాలి నానిని కూడా టార్గెట్ చేసింది. నానిని ఓడిస్తే.. నైతికంగా టీడీపీకి బలం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో నానిని ఓడించేందుకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇది కూడా చదవండి : పెట్రోల్ పోసుకునేందుకు నేను సిద్ధం: బొండా ఉమ
నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. టీడీపీ నుంచి రెండు సార్లు, వైసీపీ నుంచి రెండు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. దాన్ని తన అడ్డగా మార్చుకున్నారు. గత ఎన్నికల్లో నానిని ఓడించేందుకు.. టీడీపీ తరఫున దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. నానినే గెలిచారు. మంత్రి పదవి కూడా వరించింది. దాంతో నాని మరింత దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాని ఓడించాలని టీడీపీ బలంగా ఫిక్సయ్యింది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని అభ్యర్థిని గుడివాడ బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కొడాలి నాని నోటి దురుసుకు తగిన విధంగా బదులిచ్చే నేత అంటే నందమూరి బాలకృష్ణే అని టీడీపీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలో నానికి అన్ని విధాలుగా చెక్ పెట్టాలంటే.. బాలయ్యనే బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక గుడివాడలో కొడాలి నాని క్రేజ్ ఎలా ఉందంటే.. అక్కడ స్వయంగా చంద్రబాబు పోటీ చేసినా ఓటమి ఖాయం అనేలా ఉంది. ఈ క్రమంలో బాలయ్య అయితేనే నందమూరి అభిమానులతో పాటు.. కమ్మ సామాజిక వర్గం కూడా మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యను గుడివాడ నుంచి బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారట.
ఇది కూడా చదవండి : గుడివాడ క్యాసినో వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని
ఇక ప్రసుత్తం బాలయ్య ఎమ్మెల్యే గా గెలిచిన హిందూపురంలో టీడీపీకి మద్దతు భారీగా ఉంది. అక్కడ బాలయ్య స్థానంలో టీడీపీ తరఫున ఎవరిని బరిలో నిలిపినా విజయం ఖాయం అంటున్నారు. మరి బాలయ్య నియోజకవర్గం మార్పుకు అంగీకరిస్తారో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.