నిర్మాత అశ్వనీదత్ వ్యవహారం చూస్తే.. ఎన్నికల్లో బరిలో నిలిచే ఆలోచన ఉందా.. అందుకే ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మీద ఇంత ధాటిగా విమర్శలు చేస్తున్నారా.. అనే అనుమానాలు తలెత్తకమానవు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతుండటంతో.. టీడీపీ నుంచే బరిలో దిగి అవకాశాలే అధికంగా ఉన్నాయి అంటున్నారు. ఇక గతంలోనే ఆయన 2004లో విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి చూస్తే మాత్రం.. వచ్చే ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఒకవేళ అశ్వనీదత్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఎక్కడ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది.. అంటే.. గతంలో ఆయన పోటీ చేసిన విజయవాడ నుంచే బరిలో దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన సోదరుడిని ఎంపిక చేసినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి. బెజవాడ.. ఖచ్చితంగా గెలిచే స్థానం. అందుకే రానున్న ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా అశ్వినీదత్ ని దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.
కేశినేని నాని ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నుంచి విజయం సాధించారు. వరస విజయాలు వెనక ఆయన చరిష్మా కన్నా పార్టీకున్న ఓటు బ్యాంకే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వ్యాపారాలన్నీ మూసివేసుకున్న తర్వాత కేశినేని నాని ఫక్తు రాజకీయ నేతగా మారారు. గతంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, గద్దె రామ్మోహన్ లాంటి వంటి వారు ఉన్నా కృష్ణా జిల్లాలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తలేదు. వారు అందరినీ కలుపుకుని పోయేవారు. కానీ కేశినేని నానిని దాదాపు ఎక్కువ మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల అనేక శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గ్రూపులుగా తయారైంది.
దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేశినేని నానిని తప్పించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే పావులు కదిపి.. నాని తనంతట తానే పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేయగలగడంలో పార్టీ నాయకత్వం సక్సెస్ అయిందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కేశినేని నాని స్వచ్ఛందంగా తప్పుకుంటే విజయవాడలో పార్లమెంటు అభ్యర్థులకు కొదవ లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు పోటీ పడతారు. గెలిచే సీటు కావడంతో సహజంగానే ముందుకు వస్తారు. అయితే ఈసారి ఎవరికీ ఇబ్బందిలేని నేతను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సారి సెలక్ట్ చేసే వ్యక్తి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ.. గ్రూపు రాజకీయాలు తలెత్తకుండా.. అందరిని కలుపుకుపోయే నేత అయితే బాగుంటుందని భావిస్తున్నారట.
అశ్వినీదత్‌తో ఇలాంటి ఇబ్బందులు ఉండవనే..
కేశినేని నాని వ్యవహారం చూసిన తర్వాత.. చంద్రబాబు.. కొత్త అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దానిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున అశ్వీనదత్‌ను బరిలో నిలపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గతంలో ఓ సారి అశ్వనీదత్ విజయవాడ నుంచి టీడీపీ బరిలో నిలిచి.. ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా లేకపోయినా టీడీపీకి బలమైన సానుభూతిపరుడు. పైగా ఆయన సామాజికవర్గం కూడా కలసి వస్తుంది. ఇదే కాక.. ఆర్థికంగా బలమైన అభ్యర్థి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు బెజవాడ టీడీపీ అభ్యర్థిగా అశ్వినీదత్‌ను సెలక్ట్ చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అశ్వినీదత్ వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారని అంటున్నారు.. సినీ పరిశ్రమలో ఉన్నవారు సామాన్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలు చేయరు.. అది కూడా ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం ముందు. కానీ అశ్వినీదత్ వ్యవహారం చూస్తే.. ఫక్తు రాజకీయ నేతగానే మాట్లాడుతున్నట్లు అర్థం అవుతోంది. వీటన్నింటి పరిశీలిస్తే.. అశ్వనీదత్‌కు బెజవాడ ఎంపీ సీటు ఖరారైనట్లు స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.