అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చే.. ఈ వివాదానికి దారి తీసింది.
అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగింది. వీరిద్దరు సోషల్ మీడియా వేదిక అనంతపురం జిల్లా రాప్తాడు రాజకీయాల గురించి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగించారు.
పరిటాల కుటుంబాన్ని ఎవరైన విమర్శించాలంటే.. దమ్ముంటే రాప్తాడు వచ్చి మాట్లాడాలని టీడీపీ మద్దతుదారులు సవాళ్లు విసిరారు. దీంతో వారి సవాళ్ల స్వీకరించిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణ.. అనంతపురం క్లాక్ టవర్ వద్దకు వచ్చి.. పరిటాల కుటుంబం చేసిన అన్యాయాలను, అవినీతిని బయటపెడతానంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అనంతపురంలోని క్లాక్ టవర్ వద్దకు టీడీపీ మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల వలయాన్ని చేధించుకుంటూ ఇరువర్గాల వారు క్లాక్ టవర్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో తాను రాప్తాడు టీడీపీ కార్యాలయంకు వచ్చినట్లు వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి సెల్ఫీవీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ వర్దీయుల మధ్య రాళ్ల దాడి జరగడంతో ఓ కానిస్టేబుుల్ కి గాయమైంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సోషల్ మీడియాలో చర్చ కారణంగానే ఈ వివాదం చోటుచేసుకుందన్నారు. అలానే ఈ గొడవకు కారణమైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన వారి కోసం విచారణ చేస్తున్నామని, పూర్తి దర్యాప్తు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు తెలిపారు.