నందమూరి తారకరత్న.. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కెరీర్ తొలినాళ్లల్లో వరుస సినిమాలు రిలీజ్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఆ తర్వత ఉన్నట్లుండి సినిమాలకు దూరం అయ్యాడు. కొన్నాళ్లకు రవిబాబు అమరావతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి అడపాదడపా.. సినిమాలు చేస్తున్నాడు. హీరోగా మాత్రమే కాక.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తారకరత్న చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు అర్థం అవుతోంది. అంతేకాక.. జూనియర్ ఎన్టీఆర్ సైతం.. సమయం వచ్చినప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన తాత, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘1982లో అందరికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో నందమూరి తారకరామారావు గారు వేసిన తెలుగుదేశం అనే పునాది.. నేడు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతిగా మారింది. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే.. చంద్రబాబు నాయుడిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలి. టీడీపీ అధికారంలోకి వస్తేనే రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం సాధ్యం. అందుకోసం నా అడుగు జనాల వైపు.. నా చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు’’ అంటూ తారకరత్న అని తన భవిష్యత్ కార్యచరణను ఈ సందర్భంగా వెల్లడించారు.
అలానే తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సైతం సమయం వచ్చినప్పుడు .. టీడీపీ తరపున ప్రచారానికి వస్తారని ఈ సందర్భంగా తారకరత్న తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలప్పుడు.. తారక్ తనకు వీలున్న సమయంలో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఇక తారకరత్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తారకతర్న.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో.. అప్పుడే ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. కొందరు గుడివాడ నుంచి పోటీ చేయాలని అంటుంటే.. మరికొందరు కృష్ణా జిల్లాలోని మరో నియోజకవర్గం పేరు కూడా తెరమీదకు తెస్తున్నారు.
ఇక గుడివాడ అయితే సెంటిమెంట్ పరంగా బావుంటుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే తారకరత్న మాత్రం తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగుతానని చెప్పకపోయినా.. వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్నకు ఎక్కడి నుంచి అవకాశం కల్పిస్తారన్నది చూడాలి. మరి తారకరత్న చెప్పినట్లు.. జూనియర్ ఎన్టీఆర్.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.