దర్శకేంద్రుడు, మౌన మునిగా.. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమాలకు కొత్త హంగులద్దిన ఘనత ఆయనది. ఎన్టీఆర్‌తో కూడా మాస్ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయించిన క్రెడిట్ ఆయన సొంతం. ఇక చిరంజీవి, నాగార్జన తరం హీరోలతోనే కాక.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో బన్నీతో సహా పలువురుతో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఆయనది. పొలిటికల్, సినిమా వేదికలపై పెద్దగా కనిపించని రాఘవేంద్రరావుకి తెలుగు దేశం పార్టీ అంటే చాలా అభిమానం. పలుమార్లు ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో పాటు ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ఎంతో అభిమానం. టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్‌గా ముద్ర వేయించుకోవడానికి ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయరు. ఇక పలు సందర్భాల్లో ఆయన చంద్రబాబే నెక్స్ట్ సీఎం అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు రాసిన నేను తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణ సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 2024లో చంద్రబాబు నాయుడే సీఎం అని నమ్మకంగా తెలిపారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావుకి, టీడీపీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రసుత్తం అటు రాజకీయ వర్గాల్లోనే కాక ఫిల్మ్ నగర్‌లో కూడా జోరుగా ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..
చంద్రబాబు బయోపిక్…
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేషు హీరోగా వచ్చిన మేజర్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిగో ఆ ఐడియాను ఉపయోగించుకుని.. తనకు ఎంతో మేలు చేసిన టీడీపీకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అందించేందకు గాను రాఘవేంద్ర రావు ఓ కొత్త ప్లాన్‌ను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. రాఘవేంద్రరావుకి తెలుగుదేశం పార్టీకి వున్న అనుబంధం తెలిసిందే. ఆ పార్టీ ప్రచారానికి మాంచి పొలిటికల్ ప్రకటనలు తయారుచేసి ఇవ్వడం రాఘవేంద్రరావుకి అలవాటు. గత ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారాల వీడియోలు షూట్ చేసారు. తాజాగా కూడా మరోసారి పార్టీకి ఇలానే సాయం చేయబోతున్నారట. అయితే అది యాడ్స్ రూపంలో కాదు.. ఏకంగా బయోపిక్ రూపంలో.. అది కూడా చంద్రబాబు నాయుడిది.
ఇది కూడా చదవండి: Prakash Raj Satirical Tweet: పాలన ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసి మోదీ నేర్చుకోవాలి: ప్రకాశ్ రాజ్
యాత్ర సినిమా ప్రభావంతో..
బయోపిక్‌లకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికి పలు సందర్భాల్లో ఎన్నికల ముందు పలువురు రాజకీయ నేతల బయోపిక్‌లు తెర మీదకు వస్తుంటాయి. 2019, ఫిబ్రవరి 8న విడుదలైన యాత్ర సినిమానే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ఓ పార్ట్‌ని బయోపిక్‌గా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టం. ఆయన ప్రజలకు మరింత చేరువ అవ్వడానికి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అయన చేసిన పాదయాత్ర ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ ఘట్టం ఆధారంగానే యాత్ర తెరకెక్కింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటుడు మమ్ముట్టి నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే.. కాక నాడు ఏపీ ప్రజల కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన సాహసాన్ని ఎన్నికల ముందు మరో మారు ప్రజల ముందుకు తీసుకువచ్చారు. దాంతో సినిమా ప్రభావం ప్రజలపై బలంగా పడింది. ఇది కూడా జగన్ గెలుపుకు ఎంతో కొంత దోహదపడిందనే వారు లేకపోలేదు.
ఇది కూడా చదవండి: Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీపై స్పందించిన విశాల్.. ఏపీ పాలిటిక్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ పరిణామాలే కథాంశంగా..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఇప్పుడు ఇదే ఆలోచేన చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు, చంద్రబాబు సీఎం చేయడం కోసం తన వంతు సాయంగా.. చంద్రబాబు బయోపిక్ నిర్మించే పనిలో ఉన్నట్లు ప్రచారం అవుతోంది. దీనిలో ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి లక్ష్మి పార్వతి పార్టీని ఎలా లాక్కునే ప్రయత్నం చేసింది.. ఆ సమయంలో చంద్రబాబు తన నిర్ణయాలతో పార్టీని ఎలా గట్టెంకించారో చూపించే ప్రయత్నంలో ఉన్నారట. ఇప్పటి వరకు ఈ పరిణామాలను అందరూ వెన్నపోటుగానే విశ్వసిస్తున్నారు. కానీ రాఘవేంద్ర రావు మాత్రం పార్టీ మేలు కోసం నాడు చంద్రబాబు చేసిన సాహసంగా ఈ పరిణామాలను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు కనుక నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. ఒకవేళ రాఘవేంద్ర రావు గనక చంద్రబాబు బయోపిక్ తీస్తే.. అది టీడీపీని విజయతీరాల వైపు నడిపిస్తుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు.. ‘NTR సాక్షిగా చెప్తున్నా.. చంద్రబాబు సీఎం కావడం ఖాయం’