ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. పలువురు నూతన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మాజీలు తమకు మరోసారి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి బాలినేనిని పక్కకు పెట్టిన సీఎం జగన్.. ఆదిమూలపు సురేష్ కి మరోసారి మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. సీఎం జగన్ ఆయనను పిలిచి నచ్చజెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారం సద్దుమణిగినట్లే.. కనిపించినా.. లోపల మాత్రం బాలినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. పైగా తనను పక్కకు పెట్టిన అధిష్టానానికి తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేశారట బాలినేని.
ఇది కూడా చదవండి: ముగిసిన జగన్ – బాలినేని భేటీ.. చివరకు ఏమైందంటే..?
ఈ క్రమంలో మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత తొలిసారి ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. చూడ్డానికి ఇది స్వాగత కార్యక్రమంలా ఉన్నా.. కచ్చితంగా బాలినేని బల ప్రదర్శనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన సోమవారం సాయంత్రం జిల్లాకు రాగా బాపట్ల, మార్టూరు సమీపం నుంచి ఒంగోలు వరకు అడుగడుగునా నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున కార్లతో స్వాగతం పలికారు. అధిష్టానానికి తన బలం చూపించేందుకు బాలినేని.. ఈ ర్యాలీ తీశారని.. వైసీపీ వర్గీయులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: భగ్గుమన్న బాలినేని! మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు!
ర్యాలీలో వివాదం..
బాలినేనికి స్వాగత కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ అద్దంకి ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది. బొప్పూడి సమీపంలో బాలినేనికి కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేశ్ తమ అనుచరులతో వచ్చి స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ వెంట బయల్దేరారు. అద్దంకి నియోజకవర్గ సరిహద్దు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద శాప్‌నెట్ చైర్మన్, వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య భారీగా కార్యకర్తలతో వచ్చి స్వాగతం పలికారు. టోల్‌ప్లాజా వద్ద కాన్వాయ్ ఆగిన సమయంలో కరణం అనుచరుడు బాచిన కాన్వాయ్‌లోని ఓ వాహనంపై చేతితో కొట్టాడు. ఇది వివాదానికి దారితీసింది.
ఇది కూడా చదవండి: ఆడుకుంటూ అడవికి చేరి.. 36 గంటలపాటు ఒంటరిగా గడిపిన చిన్నారి!
గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి బాలినేని పూల దండ వేయడానికి ర్యాలీని కొద్దిసేపు ఆపారు. ఈ సమయంలో కరణం, బాచిన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గీయులు రాళ్లు, కర్రలు కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు వెంటనే స్పందించి వారించారు. ఇరువర్గాల నాయకులు కూడా అనుచరులకు సర్దిచెప్పారు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఏది ఏమైనా ఇది బాలినేని స్వాగత కార్యక్రమం కాదు.. బల ప్రదర్శన అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.