‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన మద్దతు తెలిపింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వారికి పవన్ సంఘీభావం తెలిపారు. ప్రసంగానికి ముందు పవన్ కల్యాణ్ శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపించారు. అంతేకాకుండా నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలవాలని వ్యాఖ్యానించారు. ఉక్కు పరిశ్రమ కోసం చేసిన పోరాటాలను, పోయిన ప్రాణాలు, చేసిన త్యాగాలను మరోసారి పవన్ సభాముఖంగా గుర్తుచేసుకున్నారు. అభిమానుల విషయం పవన్ ఒకింత అసహం కూడా వ్యక్తం చేశారు.
ప్రసంగం మధ్యలో అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రానికి గురయ్యారు. ‘బుర్ర పెంచుకోండి కొంచం. ఎందుకు అలా అర్థం పర్థం లేకుండా అరుస్తున్నారు. మనుషుల ప్రాణాలు పోయాయని చెప్తే ఎందుకు నవ్వుతున్నావు. మారరా మీరు ఇంక. ఇలాగే ఉంటారా? పవర్ స్టార్ అనకండి మానేయండి. కొంచెం బుర్ర పెంచుకోండి అందరూ’ అంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఎప్పుడూ అలా పవర్ స్టార్ అని కేకలు ఎందుకు వేస్తారంటూ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.