రాజకీయాలకు దూరంగా.. సొంత ఊరిలో ఉంటూ.. వ్యవసాయం చేసుకుంటూ.. ప్రశాంత జీవితం గడుపుతున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారని భావించారు జనాలు. కానీ ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..
ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్ల పాటు.. రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేశారు. ఆ తర్వాత పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పి.. సొంత ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ.. మనవలు, మనవరాళ్లతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఉరుకులు, పరుగులు జీవితానికి శుభం పలికి.. మలి దశ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు వైరల్‌గా మారతాయి. రాజకీయాలకు దూరంగా.. సొంత ఊరిలో.. వ్యవసాయం చేసుకుంటూ ఉన్న రఘువీరారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు..
మళ్లీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ సంచలన ప్రకటన చేశారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. తాను రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నానని భావించినప్పటకి.. కొన్ని పరిణామాల వల్ల ప్రసుత్తం తన మనసు మార్చుకున్నట్లు తెలిపారు. ఇక తాజాగా జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని ఒక్క మాట అన్నందుకే.. ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం తనకు బాధ కలిగించింది అన్నారు. ఈ సంఘటనలన్నింటితో తాను ఎంతో బాధపడ్డానని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించాను అన్నారు. అందుకే మళ్లీ తాను ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు.
తన సొంత ఊరు నీలకంఠాపురంలో చేపట‍్టిన ఆలయ నిర్మాణం పూర్తి చేయడం కోసం తాను నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు ఈ సందర్భంగా రఘువీరా చెప్పారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని.. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. తనను పార్టీ బెంగళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా నియమించిందని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లి అక్కడి అభ్యర్థుల విజయం కోసం తనవంతుగా కృషి చేస్తానని వెళ్లడించారు రఘువీరారెడ్డి. రాహుల్‌ను అవమానించడం వల్లే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారని చెప్పారు. తనను అభిమానించేవారు చెప్పినట్లుగా భవిష్యత్తులో నడుచుకుంటాను అన్నారు. మరి రఘువీరా రెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.