ఏపీలోని రాజకీయాలు నిత్యం వాడీవేడిగా సాగుతుంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరికి..ఎవరు తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈక్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోని కొందరు నాయకులు సంచల వ్యాఖ్యలు సైతం చేస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆసక్తికర కామెంట్స చేశారు. టీడీపీ కోసం అవసరమైతే చస్తానని అయ్యన్న అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, దివ్వవాణి, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరావు, యర్రపతినేని శ్రీనివాసరావు మొదలైన నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహానాడులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈక్రమంలో అయ్యన్న పాత్రుడు ప్రసంగిస్తూ..”ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని, నేడు చంద్రబాబును విమర్శిస్తాడా?. శ్రీకాకుళం వచ్చి సన్న బియ్యం ఇస్తానని, రెండేళ్ళ తర్వాత మాట మార్చిన ఘనుడు నాని. నాపై11 కేసులు పెట్టారు. ఈ వయసులో నాపై రేప్ కేసు పెడ్డడం బాధాకరం. నేను ఎవరికి భయపడే రకం కాదు. రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్న జగన్ కు రోజులు దగ్గరపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, ఎన్టీఆర్ రుణం తీర్చుకోవాలి” అని పిలుపునిచ్చారు. మరి.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: TDP పార్టీ ముందు జగన్ ఓ బచ్చా: చంద్రబాబు నాయుడు