జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారని, ఆయన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు యువకులు.. తాగి పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిపై గొడవకు దిగారు. అయితే వాళ్ళని పవన్ పై దాడి చేసేందుకు పంపించారని, వాళ్ళు రెక్కీ నిర్వహించడానికే వచ్చారని జనసేన వర్గాలు బలంగా ఆరోపించాయి. గతంలో కూడా పవన్ పై రెక్కీ నిర్వహించారని అన్నారు. పవన్ హత్యకు కుట్ర పన్నారని.. రూ. 250 కోట్ల డీల్ కూడా కుదుర్చుకున్నారని వార్తలు ప్రచారం చేశారు. దీనిపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అన్నారు. దీంతో పవన్ భద్రత విషయమై జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.
పవన్ ఇంటి వద్ద ఊగిసలాడిన వాళ్ళని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఎలాంటి రెక్కీ చేయలేదని.. అసలు అదేమీ పెద్ద సీరియస్ మేటర్ కాదని తెలిపారు. పవన్ హత్య కుట్ర జరగలేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ జనసేనాని భద్రత విషయంలో జనసైనికులు, పార్టీ వర్గాలు ఆందోళనలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భద్రత కోసం మాజీ భారత ఆర్మీ ఇంటిలిజెన్స్ అధికారులను నియమించుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ భద్రత సిబ్బంది విభాగంలో పది మంది మాజీ ఆర్మీ అధికారులు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటి బయట రోడ్డు మీద నిలబడి కొందరు సెక్యూరిటీ సిబ్బంది చర్చించుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది నియామకంపై త్వరలోనే పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ. పవన్ భద్రత మరింత పెంచాలని జనసైనికులు భావిస్తున్నారు.
A new team of 10 ex-Army Intelligence people was recruited to protect our chief @Pawankalyan.
Stay tuned to the party’s official channel for more details. pic.twitter.com/Kxl0yngyWu
— PawanKalyan Fan (@PawanKalyanFan) December 2, 2022