ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీశ్ రావుపై భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఘాట్ వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట లాగ హుజురాబాద్ ను అభివృద్ధి చేస్తానని, అన్ని విధాల ఆదుకుంటానని, మోసపూరితమైన వాగ్దానాలు చేసినా.., ఇక్కడి ప్రజలు తెరాసను ఓడించారని ఈటెల రాజేంద్ర అన్నారు.కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజేందర్ కు సిద్ధిపేట జిల్లా రంగదాంపల్లి చౌరస్తా వద్ద భాజపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు.
“ఉపఎన్నికలో నన్ను ఓడించడానికి అధికార పార్టీ తెరాస ఎన్నికుట్రలు పన్నినా హుజురాబాద్ ప్రజలు గెలిపించి వారికి తగిన గుణపాఠం చెప్పారు. హరీశ్ రావు అనాయ్యం, అధర్మం, కుట్రలు నమ్ముకున్నారు, వాటికి ఆయన బలి అవుతారు. తెరాసకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయమనే కానీ.. దౌర్జన్యాలు కోసం కాదు, ఈ ఉపఎన్నికల్లో తెరాస కుట్రలు చూసి సమాజం వారి అసహించుకుంటుంది. ఎన్నికల కోసం హుజురాబాద్ లో ప్రారంభించిన దళిత బంధువు పథకం రాష్ట్రమంతటా అమలు చేయాలి” అని ఈటల డిమాండ్ చేశారు.