తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ లో పర్యటిస్తున్న ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇక ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లో పెట్టినా ముందుగా నన్నే పెట్టాలని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇక సముద్రం ప్రశాంతంగా ఉందని చులకన చూడొద్దని అదే రేపటి ప్రళయంగా మారొచ్చనే రీతిలో ఈటల కేసీఆర్ పై ధ్వజమెత్తారు.
దీంతో పాటు దళిత బంధు పథకంలో ఇచ్చే సొమ్ము ప్రజల సొమ్మని, డబ్బు, మద్యం పక్కన పెట్టి నాపై పోటీకి దిగాలని ఈటల సవాల్ విసిరారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ వైపు తిరుగుతున్నారు. అధికార పార్టీ సైతం దళిత బంధు పథకంతో ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. కాగా తెరాస నుంచి అభ్యర్ధిగా తెలంగాణ ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ పార్టీ అధిష్టానం ఖారారు చేయగా బీజేపీ నుంచి ఈటల బరిలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎంపికలో మాత్రం ఇంకా మల్లగుళ్లాలు పడుతోంది. హుజరాబాద్ ఉప ఎన్నికపై ప్రధానంగా అన్ని పార్టీలు గురి పెట్టి తెర వెనుక మంతనాలు జరుపుతున్నాయి.