టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. బుధవారం ఖమ్మంలో నిర్వహించని బహిరంగ సభ.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను అభివృద్ధి చేసింది.. టీడీపీనే అనడం.. తెలంగాణలో కూడా పార్టీ బలపడాల్సిన అవసరం ఉందంటూ.. చంద్రబాబు వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాక పార్టీని వీడిన నాయకులు తిరిగి టీడీపీలో చేరాలని.. తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, మాజీ టీడీపీ నేతలు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఎర్రబెల్లి దయాకర్ రావు.. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని.. సీనియర్ ఎన్టీఆర్‌దేనని ఈ సందర్భంగా ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాక ప్రజలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. బలంగా కోరుకుంటున్నారని తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఆ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారంటూ ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సవాల్ విసిరారు. ఇక ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జూనియర్ టీడీపీలోకి రావాలని.. కార్యకర్తలు, పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. సందర్భం వచ్చిన ప్రతి సారి తమ మనసులోని మాటను అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగాంగా.. చంద్రబాబు ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించిన సమయంలో.. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు వినిపించాయి. ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు ప్రదర్శనలు చేశారు. ఎన్టీఆర్ సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆఖరికి చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆ తరువాత మచిలీపట్నం పర్యటన, సభలోకూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఎన్టీఆర్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించాలని.. టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు కోరుతున్నప్పటికి.. చంద్రబాబు మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు.
ఇక తాజాగా.. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్న వేళ.. ఖమ్మం సభలోనూ జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు హోరెత్తాయి. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి.. జూనియర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తారేమో చూడాలి. మరి జూనియర్‌ని ఉద్దేశించి.. ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సరైనవే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.