ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రజల, యువత సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. జనవరి 27న కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరుకు 700 కిలోమీటర్ల పైనే పాదయాత్ర సాగింది. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ .. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులను పలకరిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే లోకేశ్ పాదయాత్రలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రజల, యువత సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. జనవరి 27న కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరుకు 700 కిలోమీటర్ల పైనే పాదయాత్ర సాగింది. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ .. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులను పలకరిస్తూ.. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ భరితమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. తమకు ఎన్టీఆర్ ట్రస్ట్ జీవితాన్ని ఇచ్చిందని, ఆ ట్రస్ట్ ద్వారా చదువుకుని తమ పిల్లలు ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని లోకేశ్ తో అంటూ ఓ మహిళ ఎమోషనలయ్యారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి అనంతపురంలో కొనసాగుతుంది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. అలానే లోకేశ్ కూడా మహిళలు, యువత, వృద్ధులతో మమేకమతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందు సాగుతున్నారు.
ఇదే సమయంలో కొందరు లోకేశ్ ను కలిసి టీడీపీ హాయాంలో తాము పొందిన లబ్ధికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సాయం పొందిన కుటుంబాలు కూడా లోకేశ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపాయి. ఈక్రమంలోనే అనంతపురం జిల్లాకు చెందిన తంగకుంట ప్రభాకార్ కుటుంబం లోకేశ్ ను కలిసింది. ఆయన కుటుంబంలోని పిల్లలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్నారు. వారి పిల్లలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్నారు. వారి చదువులు.. ఇతర అవసరాలు మొత్తం ఎన్టీఆర్ ట్రస్టే చూసుకుంది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి ఆరుగుర్ని చదివిస్తే.. అందులో నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
వారిలో ఇద్దరు ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తూ స్వగ్రామంలో ఉంటున్నారు. వారు నారాలోకేష్ పాదయాత్రకు వస్తున్నారని ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. లోకేష్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా మహిళ చెప్పిన మాటలకు లోకేశ్ ఎమోషనలయ్యారు. అలానే ఎన్నో కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలబడింది. కొంత మంది సివిల్స్‌లో కూడా విజయం సాధించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇలా ఎంతో మంది సాయం పొంది.. ఉన్నత స్థితికి ఎదగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.