వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ).. ఆంధ్రప్రదేశ్ లో కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడంతో పాటు… సినీ గ్లామర్ ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే విజయశాంతి, జయప్రత, జీవిత తదితరులు బీజేపీలో ఉండగా… జయసుధ కూడా ఇదే పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో విషయం కూడా ఆసక్తి కలిగిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దివ్యవాణి అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. గుంటూరు తెనాలి పుట్టిన ఈమె.. తెలుగు, కన్నడలో కలిపి 40 సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత విరామం ఇచ్చిన ఈమె.. రాధాగోపాలం సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. పుత్తడిబొమ్మ సీరియల్ లో కూడా నటించారు. ఇక 2019లో తెలుగుదేశంలో చేరిన ఈమె.. ఈ ఏడాది ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ తో, శామీర్ పేట్ లోని ఆయన ఇంట్లోనే భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈమె కూడా కాషాయదళంలో చేరతారా అని ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి: TDP కి రాజీనామా చేస్తున్న.. అక్కడ మర్యాదలు మాములుగా లేవు.. తట్టుకోలేకపోయా: దివ్యవాణి