Digvijay Singh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర రేపు ఉదయం కన్యాకుమారి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ ఈ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కేసీఆర్ అన్నారు. కానీ, ఎక్కడ చేశారు. ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మళ్లీ మాతో జతకట్టవచ్చు కదా?.
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్ రాష్ట్రం తెచ్చేదా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కష్టపడుతున్నారు. రాహుల్ పాదయాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలుంటాయి. వైఎస్ జగన్ మా రాజశేఖరరెడ్డి కొడుకు. కాంగ్రెస్ నేత వైఎస్ కొడుకనే కదా ప్రజలు ఆయన్ని సీఎంగా ఎన్నుకున్నారు. మేము కేసులు పెట్టామని ఆయన పార్టీ వీడారు’’ అని పేర్కొన్నారు. మరి, దిగ్విజయ్ సింగ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : MLA Kilari Rosaiah: అది పవన్ బర్త్‌డే వేడుక కాదు: YSRCP ఎమ్మెల్యే కిలారి రోశయ్య