పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉన్నారు. సందర్భం దొరికిన ప్రతి సారి అధికార పార్టీ మీద తనదైన శైలీలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ప్లీనరీ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు జనాల్లోకి ఎంతగా దూసుకెళ్లాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం పవన్ పొలిటకల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. నిత్యం జనాల్లో ఉండేలా కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. కౌలు రైతుల కోసం భరోసా యాత్ర చేపట్టి.. ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పవన్ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయనున్నట్లు సమాచారం.ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ఓటమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనపై కక్ష్య గట్టే రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడించారని వ్యాఖ్యనించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను నా స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదు. 5 కోట్ల ఆంధ్రుల కోసం రిస్క్ చేసి వచ్చాను. నేను రాజకీయాల్లోకి వస్తే.. నా సినిమాలు ఆపేస్తారు.. ఆర్థిక మూలాలను దెబ్బకొడతారని తెలిసినా.. వాటికి భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చాను. కానీ నాపై కక్ష్య గట్టి పోటీ చేసిన రెండుచోట్ల ఎమ్మెల్యేగా ఓడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నేను రాలేను.. ప్రతి గ్రామంలో ప్రజలే ఎదురుతిరిగి పోరాడే తత్వాన్ని, మనస్తత్వాన్ని పెంచుకోవాలని’’ పవన్ పిలుపునిచ్చారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశాడు. రెండు చోట్ల ఓటమి పాలయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.