ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఇకపై రాష్ట్రమంతటా గుంతలు లేని రోడ్లు కనిపించాలంటూ ఆయన సూచించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎం కొన్ని కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఆదర్శనీయంగా ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. ఇక దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు.. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులను మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇక దీంతో పాటు టిడ్కో ఇళ్లపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో సరైన మౌలిక సదుపాయాలు లేకుండా నిర్మించారని, ఇలాంటి ఇళ్లపై అధికారులు ద్రుష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ఇది కూాడా చదవండి: Minister Nirmala Sitharaman: అధికారికి మంచినీళ్లు అందించిన నిర్మలా సీతారామన్! వీడియో వైరల్..
రాష్టమంతటా గుంతలు లేని రోడ్లు, వాటర్ ట్యాంక్ లు, మరుగు నీటి శుద్ది వంటివి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మూడేళ్లలో టిడ్కో ఇళ్ల కోసం రూ.5500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇక వీటితో పాటు విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనపై కూడా సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 75 కిలో మీటర్ల మేర మెట్రో రైలు ప్రతిపాదనలపైనే కాకుండా వనరుల సమీకరణపై కూడా సీఎం జగన్ చర్చించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.