సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో.. అమరావతి ప్రాంత ప్రజల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఒక్క నిర్ణయంతో నేడు అక్కడ జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ వివరాలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. తల్లి కడుపులో ఉన్న బిడ్డ మొదలు.. కాటికి కాళ్లు చాచిన పండు ముసలి వరకు.. ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేసేలా సంక్షేమ పథకాలు రూపొందించి.. అమలు చేస్తున్నారు సీఎం జగన్. వృద్ధులు, వికలాంగుల కోసం పెన్షన్‌లు, చదువుకునే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, విద్యా దీవేన, వసతి దీవెన, పేదింటి ఆడపిల్లలకు వివాహం సందర్భంగా నగదు సాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రజల మదిలో గొప్ప స్థానం సాధించుకున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. అయితే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని కాదు అంటూ.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు సీఏం జగన్. ఈ నిర్ణయాన్ని అమరావతి ప్రాంత ప్రజలు ఆమోదించలేదు. ఈ క్రమంలో జగన్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్నారు జగన్. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృమైతే మిగతా ప్రాంతాలకు ఎంత నష్టం వాటిల్లుతుందో రాష్ట్ర విభజన తర్వాత స్వయంగా అనుభవంలోకి వచ్చింది. మరోసారి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు సీఎం జగన్. అయితే ఈ నిర్ణయాన్ని అమరావతి ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో వైసీపీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి.
అమరావతిని రాజధాని చేస్తామంటేనే రాష్ట్రం బాగు కోసం ఆలోచించి.. మేం భూములు ఇచ్చామని అమరావతి ప్రాంత రైతులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో.. అమరావతి రైతులు.. మహా పాదయాత్ర చేపట్టారు. ఇక రాజధాని అంశానికి సంబంధించి.. సీఎం జగన్ మీద అమరావతి ప్రాంత ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగింది. పాదయాత్ర సందర్భంగా ఎన్నో విమర్శులు చేశారు. శాపనార్థాలు కూడా పెట్టారు. మరోవైపు విపక్షాలు.. జగన్ అమరావతిలో పర్యటించలేడు.. ఒక వేళ వెళ్లినా.. పరదాల వెనక దాక్కుని వెళ్తాడంటూ ఎద్దేవా చేశారు.
మరి నేడు ఒక్క నిర్ణయంతో ఈ సీన్‌ని రివర్స్ చేశారు సీఎం జగన్. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే.. భయపడింది అని అర్థం కాదు.. మరింత బలంగా దాడి చేస్తుందని అని అంటారు. జగన్ విషయంలో ఈ వ్యాఖ్యలు సరిగా సరిపోతాయి. ఇన్నాళ్లు అమరావతి రైతులు ఎన్ని విమర్శలు చేసినా.. విపక్షాలు ఎన్ని సార్లు ఎద్దేవా చేసినా సీఎం జగన్ మౌనంగానే ఉన్నారు. కానీ నేడు ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఏ అమరావతి ప్రాంతంలో అయితే ఇన్నాళ్లు తాను శాపనార్థాలు పెట్టించుకున్నాడో.. విమర్శలు ఎదుర్కొన్నాడో.. నేడు అదే ప్రాంతంలో.. జయహో జగన్ అని ప్రజల చేత అభిమానంగా సెల్యూట్ చేయించుకుని.. మకుటం లేని మహారాజుగా నిలిచాడు. తిట్టిన చోటై.. జై కొట్టించుకున్న జగన్ నిర్ణయం చూసి ఏ కామెంట్స్ చేయాలో అర్థం కాక.. విపక్షాలు గిలగిల కొట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలో పేదలందరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రాజధాని సీఆర్డీఏ పరిధిలో సుమారు 50,793 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించి రికార్డు సృష్టించారు సీఎం జగన్. ఈ ఒక్క నిర్ణయంతో ఇన్నాళ్లు ఏ అమరావతి ప్రాంతంలో శాపనార్థాలు పెట్టించుకున్నాడో.. నేడు ఇళ్ల పట్టాల పంపిణీతో.. జయహో జగన్ అంటూ మహరాజుగా జై కొట్టించుకుంటున్నారు. 50 వేలకు పైగా పేదలకు ఇంటి స్థలం కేటాయించి.. మంచి మనసు చాటుకున్నాడు అంటూ ప్రశంసలు పొందుతున్నాడు. ఈ పరిస్థితిపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక విపక్షాలు మౌనంగా ఉన్నాయి. ఇక అమరావతిలో జగన్ సభకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. ఇది కదా.. మా నాయకుడి రేంజ్ అంటూ వైసీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.