తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తన దత్తత గ్రామాన్ని సందర్శించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పలుమార్లు చెప్పిన విషయం మనకందరికీ తెలుసు. దీంతో నేడు వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామ అభివృద్ధి విషయంలో పలు సూచనలు చేయనున్నారు. గతంలో ఆ గ్రామన్ని పర్యటించిన సీఎం అనేక హామీల ఇచ్చారు.
గ్రామ సర్పంచ్, అధికారులతో ముచ్చటించి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి అంశాల్లో తోడుగా ఉంటానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరోసారి వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇక దీనిపై ప్రతిపక్షాలు భిన్న వాదనలు వ్యక్తం చేస్తున్నాయి. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక అధికార వర్గం మాత్రం సీఎం ఇచ్చిన హామీ మేరకు వాసాలమర్రిని సందర్శించనున్నారని తెలుపుతున్నారు. ఆ గ్రామంపై గత పర్యటనలో సీఎం ఇచ్చిన హామీ పట్ల వెళుతున్నారని, ప్రతిపక్షాలు ఈ విషయంలో పెద్దగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అధికార వర్గం ఆరోపిస్తోంది.