పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. పోలవరం నిర్మాణం విషయంలో చోటు చేసుకుంటున్న జాప్యంపై టీడీపీ చేసిన విమర్శలను సీఎం జగన్ ధీటుగా తిప్పి కొట్టారు. పోలవరం ఎత్తు తగ్గిGచారన్న విమర్శలపై స్పందిస్తూ.. ప్రాజె క్ట్ ఎత్తు కాదు.. చంద్రబాబు ఎత్తు తగ్గుతున్నారంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని, పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించబోమని జగన్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్‌పై నాగబాబు దారుణమైన పోస్ట్! ఆ పదం వాడటంతో!
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఆర్థికంగా నష్టం జరగడమే కాకుండా, నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని జగన్ తెలిపారు. స్పిల్ వే నిర్మాణంలో చంద్రబాబు అనేక తప్పులు చేశారని విమర్శించారు. ఎగుర కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ మధ్య నీళ్లు రాకుండా చేసి మెయిన్ కట్టాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం నదిని కుడివైపు మళ్లించాలని, నీటిని మళ్లించడానికి ముందే స్పిల్ వే పెట్టాల్సిందన్నారు. అయితే స్పిల్ వే పూర్తిచేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని, 2 కి.మీ కాఫర్ డ్యామ్ అసంపూర్తిగా వదిలేయడంతో స్పిల్ వే పనులు పూర్తి కాలేదని సీఎం జగన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: RRR టికెట్ రేటు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
2013-14 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు, పూర్తి కాలేదని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న తాను ప్రశ్నిస్తే, తమ గొంతు నొక్కేశారని సీఎం జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు చేసిన పనులకు 2019 లోనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని సీఎం జగన్ జోస్యం చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం కమిషన్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను తమ చేతుల్లోకి తీసుకుందని అన్నారు. పోలవరం టూర్ పేరుతో 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, పోలవరం వద్ద తన అనుచరులతో భజన చేయించుకున్న పెద్దమనిషి చంద్రబాబు అని సీఎం జగన్ అన్నారు.
ఇది కూడా చదవండి: మేకపాటి గౌతమ్ రెడ్డికి అరుదైన గౌరవం..సీఎం జగన్ కీలక నిర్ణయం
తాము చంద్రబాబు నాయుడిలా కాకుండా, ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ ఆర్ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని సీఎం జగన్ తెలిపారు. 2023 ఖరీఫ్ సీజన్ వరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఆ ప్రాజెక్ట్ వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ కు అంకితమిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఛాలెంజ్ చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.