ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్ని కష్టాలు ఉన్నా నన్ను కదిలించలేవు, బెదిరింలేవని అన్నారు. ఇక దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు.
ఇది కూడా చదవండి: జగన్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు భయమా? భక్తా?.. ఇంత మాస్ ఏంటి జగన్ అన్న?
పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని కూడా అన్నారు సీఎం జగన్. ఇక నేను చేపట్టిన పాదయాత్రలో ఎన్నో గాథలు, బాధలు విన్నా విద్యారంగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేశామని తెలిపారు. అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చాం అన్నారు సీఎం జగన్. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.