చింతమనేని ప్రభాకర్.. తెలుగు రాజకీయాల్లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం చింతమనేనికి అలవాటే. అయితే.., అవన్నీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలే అంటారాయన. ఇక ఎన్నికలకి ముందు దెందులూరు నియోజకవర్గంలో నన్ను ఢీ కొట్టే మగాళ్లు లేరని మీసం మెలేసిన చింతమనేని.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ.., చింతమనేని అధికారంలో లేకపోయినా.. దెందులూరులో మాత్రం వర్గ పోరుకి బ్రేక్ పడటం లేదు. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గ పరిస్థితిలను, చింతమనేని అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.
సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” కార్యక్రమం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ జాఫర్ చింతమనేని ఇంటర్వ్యూ చేశారు. హాట్ హాట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో చింతమనేని జూనియర్ యన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న స్థితిలో ఆ పార్టీకి జూనియర్ యన్టీఆర్ అవసరం లేదంటారా అంటూ జాఫర్ ప్రశ్నించాడు. దీనికి జాఫర్ తనదైన స్టయిల్ లో చాలా స్ట్రైట్ గా సమాధానం ఇచ్చాడు.
“జూనియర్ యన్టీఆర్ ని.. చంద్రబాబు గాని, పార్టీ నాయకులు గాని దూరం పెట్టలేదు. ఆయన ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. తనకి పార్టీలోకి రావాలి అనిపించినప్పుడు.. కచ్చితంగా పార్టీలోకి వస్తాడు. ఆయన్ని ఎవ్వరూ ఆపరు” అంటూ సమాధానం ఇచ్చారు చింతమనేని. ప్రస్తుతం యన్టీఆర్ పై జాఫర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. చింతమనేని కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.