రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో అంచనా వేయడం అసాధ్యం. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మిత్రులు.. శత్రువులుగా మారుతూ ఉంటారు. శత్రువులు.. మిత్రులుగా మారుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఇలాంటి పరిణామామే చోటు చేసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా గుర్తింపుపొందిన కేవీపీ రామచంద్రరావు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం కావడమే ఈ ఊహాగానాలకు కారణం అయ్యింది.
కేవీపీ అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే కేవీపీ అన్న విధంగా అప్పట్లో వీరి బంధం ఉండేది. వీరిద్దరు తమ జీవితకాలం అంతా టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వీరే ప్రధాన కారణం. కానీ.., వైఎస్సార్ అకాల మరణంతో ఆ కుటుంబంతో కేవీపీ బంధానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. కేవీపీ మొదట్లో జగన్ దగ్గర అడ్జెస్ట్ అయ్యే ప్రయత్నం చేసినా.. ఎందుకో అది వర్కౌట్ కాలేదు. అలా అని కేవీపీ ఏమి జగన్ కి వ్యతిరేకంగా ప్రత్యర్థులతో చేతులు కలపలేదు. వైఎస్సార్ పై గౌరవంతో తటస్థంగా ఉండిపోయారు. కానీ.., ఇన్నాళ్ల తరువాత కేవీపీ చంద్రబాబుని కలవడం, ఆయనతో చర్చలు జరపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవీపీ టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్దమయ్యారా? అందుకే చంద్రబాబుతో మంతనాలు జరిపారా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చంద్రబాబు, కేవీపీ చాలాసేపు నిలబడి మాట్లాడారు. అయితే.. ఈ కలయికకి నిజంగానే రాజకీయం కోణం ఉందా? లేక.. ఎక్కడైనా మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.