రెవెన్యూ లోటు ను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 15 వ ఆర్థిక సంఘం సిఫార్స్ ల మేరకు జగన్ సర్కార్ కు రావాల్సిన నిధులను తాజాగా విడుదల చేసింది. ఏపీ తో పాటుగా రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న 14 రాష్ర్టలకు కలిపి రూ.7183.42 కోట్లను విడుదల చేశామని కేంద్రం పేర్కొంది. దాంతో ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ గ్రాంట్ రూపంలో కేంద్రం రూ.7032.67 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కలిగించింది. 15 వ ఆర్థిక సంఘం సిఫార్స్ ల మేరకు జగన్ సర్కార్ కు రావాల్సిన రెవెన్యూ లోటును తాజాగా విడుదల చేసింది. రెవెన్యూ లోటు కింద రూ. 879 కోట్ల రూపాయల గ్రాంటును విడుదల చేసింది. దీంతో ఆర్థికంగా లోటును ఎదుర్కొంటున్న ఏపీకి ఊరట లభించింది. ఏపీతో పాటు 8వ వాయిద కింద హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, త్రిపుర, రాజస్థాన్, పంజాబ్,నాగాలాండ్ రాష్ట్రాలకు గ్రాంటును రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2022-2023 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ. 57,467.33 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Hon’ble PM @narendramodi ji led gvt released Revenue Deficit Grant of Rs 879.08 crore for 7th month of financial year 2022-23 to Andhra Pradesh, amount of RDG released to state so far in current financial year is Rs 6153.58 crores.@BJP4India‘s gvt taking full care of our AP. pic.twitter.com/9I4j0GbmXZ
— Ramesh Naidu Nagothu/రమేశ్/रमेश नायडू (@RNagothu) October 8, 2022