కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త కొత్త పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటాయి. ఆ పథకాల వల్ల పేదరికాన్ని దేశం, రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి అన్నదే ఆ ప్రభుత్వాల ధ్యేయం. అందులో భాగంగానే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది పేదలకు సంవత్సరం పాటు ఫ్రీగా రేషన్ అందివ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన భారాన్ని అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర మంత్రివర్గం కీలక భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది పేదలకు ఇస్తున్న ఫ్రీ రేషన్ ను మరో ఏడాది కొనసాగించాలని.. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆహార భద్రత చట్టం ప్రకారం.. రాయితీ ధరల్లో, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(PMGKAY) కింద పేదలకు ఉచితంగా బియ్యం, గోధుమలు అందిస్తూ వచ్చింది.
కానీ ఇప్పుడు ఆ రెండు పథకాలను విలీనం చేసి.. అంత్యోదయ అన్నయోజన కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున మిగతా వారికి నెలకు తలసరి 5 కేజీల చోప్పున ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ..”ఆహార భద్రత చట్టం కింద ఇంతకు ముందు వరకు కొద్ది మెుత్తంలో రేషన్ పై డబ్బులు వసూలు చేసేవారు. కానీ ఇప్పటి నుంచి ఆ మెుత్తాలను వసూలు చేయకుండా దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని ప్రధాన మంత్రి నిర్ణయించారు. ఈ పథకం 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుంది” అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు ఈ పథకానికి సంబంధించిన రూ. 2 లక్షల కోట్ల రూపాయలను కేంద్రమే భరిస్తుందని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల దేశంలో ఉన్న పేదప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Modi Govt. is committed to food security for all.
Foodgrains provided to the beneficiaries under the National Food Security Act to be free for one year.
Govt’s annual food subsidy for the next year to increase to over ₹2 lakh crore for #AnnSeAntyoday pic.twitter.com/Pm6n4O1Tim
— Piyush Goyal (@PiyushGoyal) December 23, 2022