టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై కొంతమంది చెత్తవాగుడు వాగుతున్నారని.. వారి పని పట్టడానికి 100మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామని.. చంపడానికైనా, చావడానికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని.. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. తమ బ్యాచ్ 24 గంటలు సిద్ధంగా ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: కుగ్రామం నుండి హైటెక్ CM వరకు! చంద్రబాబు నాయుడు ప్రస్థానం!
చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయనే భ్రమల నుంచి అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా బయటకు రావాలన్నారు వెంకన్న. వైఎస్సార్‌సీపీలో సీనియర్లను కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇకనైనా తమ పద్దతి మార్చుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా: సీఎం జగన్చంద్రబాబు ముందు చూపు వల్లే ఉమ్మడి ఏపి ఎంతో అభివృద్ధి చెందిందని.. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. నమ్మి ఓట్లేస్తే జగన్ ప్రజలను నట్టేట ముంచారని.. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. విజయవాడలో కేక్ కట్ చేసి, పేదలకు చీరలను పంపిణీ చేశారు. చంద్రబాబు భారీ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. బుద్ధా వెంకన్న చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మరి బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అవుటర్ రింగ్‌రోడ్డుపై థమ్స్అప్ లోడ్ లారీ బోల్తా.. ఎగబడ్డ జనం.. క్షణాల్లో లూటీ!