తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో శ్రీ విద్యానికేతన్ ఆవరణంలో మోహన్ బాబు సాయిబాబా ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని చుట్టు పక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వారు దర్శించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మోహన్ బాబుకు దైవభక్తి కూడా ఎక్కువే అన్న విషయం అందరికి తెలిసిందే. అందులోనూ ఆయన సాయిబాబాకు పరమ భక్తుడు. అదే భక్తితో తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణంలో సాయిబాబా ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని చుట్టు పక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వారు దర్శించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబాకు బంగారు కిరీటాన్ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బహుకరించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహన్‌బాబు యూనిర్శిటీ ఆవరణలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా ఆలయాన్ని మోహన్ బాబు నిర్మించారు. ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా, అందంగా నిర్మించారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అంతేకాక ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సాయి బాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతేకాక సాయిబాబాకు తమ శక్తి మేరకు బహుమతులు సమర్పించారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబం ఈ సాయిబాబా గుడిని సందర్శించారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబ సభ్యులు సోమవారం సాయిబాబా మందిరాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే నాగేంద్ర సతీమణి దానం అనిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అక్కడి వెళ్లారు. వారికి మోహన్ బాబు వర్శిటీ వీసీ నాగరాజారామారావు, సీఏ తులసినాయుడు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సాయిబాబాకు విశేష పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని అందజేశారు.
అంతేకాక వారే స్వయంగా సాయిబాబా విగ్రహానికి బంగారు కిరీటాన్ని అలంకరించారు. అనంతరం వీరికి పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సాయిబాబా మందిరాన్ని గతంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఈ ఆలయాని దర్శించి.. బంగారు కిరీటం స్వామి వారికి బహుకరించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.