ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయలు భలే రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇరు ప్రాంతాల్లో బీజేపీ తన ఉనికి చాటుకునేందుకు తెగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపఎన్నిక ఇంచార్జ్ జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే.. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జమ్మికుంటలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు, బీజేపీ నాయకుడు సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అబద్దాల కోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి దగ్గరినుండి ఇప్పటిదాకా చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. ఈటల రాజేందర్ కు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఎన్నికతో ధర్మం గెలవాలంటే ఈటల రాజేందర్ ను బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు. వాళ్లంతా నేతి బీరకాయలు అని.. ఈటెల మాత్రం నీతి బీరకాయ అని అన్నారు. ఈ సందర్భంగ బాబు మోహన్ కార్యకర్తలను, అభిమానులను తన ఆటపాటలతో ఉర్రూతలూగించారు. చినుకు చినుకు అందెలతో పాట పాడుతూ స్ట్టెప్పులు వేశారు.