తెలంగాణ రాజకీయాల్లో రాజన్న రాజ్యం రావాలంటూ వైఎస్‌ఆర్‌టీపీ (వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది) వైఎస్ షర్మిల. అయితే ఈ మధ్య కాలంలోనే ఆమె పార్టీ తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోతుంది. ఇక క్రమంలోనే పార్టీలో ఉన్న కొందరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిలకు మరో కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత ఇందిరా శోభన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
నా అభిమానుల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. కొందరు అనుచరులు, శ్రేయోభిలాషులు ఈ పార్టీలో కొనసాగవద్దన్నారని దీని కారణంగానే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేశానని ఆమె అన్నారు. దీంతో రాజీనామా పత్రాన్ని షర్మిలకు పంపినట్లు ఇందిరా శోభన్ తెలిపింది. కాగా ఈ మధ్య కాలంలో ఇందిరా శోభన్ వైఎస్ షర్మిల తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొని పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీకి రాజీనామా చేయటం చర్చనీయాంశమవుతోంది. దీంతో ఇందిరా శోభన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ తరుణంలో ఆమె నిజంగానే హస్తం పార్టీలోకి వెళ్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.