కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికి.. పార్టీలు మాత్రం స్పీడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. భారీ బహిరంగ సభల నిర్వహణతో పోలిటికల్ హీట్ పెంచుతున్నారు. బీజేపీ పార్టీ.. టీఆర్‌ఎస్ పట్ల దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద అంబర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్.. కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని ఆరోపించారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం.. కేసీఆర్ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పుకొచ్చాడు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సంద్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకముందు.. కేసీఆర్.. ఆయనను ప్రలోభాలకు గురి చేశాడు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరితో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవితో పాటు.. వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ రాజగోపాల్ రెడ్డి ఆ ఆఫర్‌ను తిరస్కరించి.. బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రలోభాలను సైతం లెక్కచేయక.. ప్రజల బాగు కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి. ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మనందరిది అని అన్నారు. అంతేకాక కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని తెలిపారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.