కొన్ని రోజుల క్రితం హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. హరీశ్ వ్యాఖ్యాలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మండి పడ్డారు. తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం తెలంగాణ మినిస్టర్ హరీశ్ రావు.. ఏపీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ మంత్రులు, నేతలు మండి పడ్డారు. ముందు మీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి.. తర్వాత మాకు చెప్దురు నీతులు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇక తాజాగా ఈ వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ప్రజల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దంటూ వైసీసీ నేతలపై మండి పడ్డారు. ఆ వివరాలు..
ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. వైసీపీ నేతలపై మండి పడ్డారు. తెలంగాణ ప్రజల్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని.. వైఎస్సార్‌సీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉందన్నారు పవన్. ఒక జాతిని అవమానిస్తుంటే సీనియర్లు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీ నేతలు హద్దులు దాటి మాట్లాడారని.. ఇది ఇబ్బందిగా మారిందని తెలిపారు. పాలకులు వేరు, ప్రజలు వేరని.. పాలకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదన్నారు. పాలకులు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు వర్తించవని పవన్ స్పష్టం చేశారు.
కానీ ఏపీ మంత్రులు హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం.. తనకు మనస్తాపం కలించింది అన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. హరీశ్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆ మంత్రిని, వ్యక్తిని మాత్రమే ప్రస్తావించాలని.. అంతేతప్ప ఈ వివాదంలోకి ప్రజల్ని లాగొద్దన్నారు. ఒక జాతి, జాతి అని తిట్టడం సరికాదన్నారు. ఏపీకి చెందిన వారికి తెలంగాణలో వ్యాపారాలు, ఇళ్లు లేవా అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దయచేసి మంత్రివర్గంలో ఉన్నవాళ్లు, ఎమ్మెల్యేలు అదుపుతప్పి మాట్లాడితే ముఖ్యమంత్రి స్పందించాలని.. తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. మరి జనసేన అధ్యక్షుడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.