వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుబడింది.. పరిశ్రమలు తిరిగి వెళ్లిపోతున్నాయి… అసలు రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడులు రావడం లేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పరిశ్రమలు అన్ని తమ ప్రభుత్వ హయాంలో వచ్చినవే అని.. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ వెనకబడిందంటూ విష ప్రచారం చేస్తున్న విపక్షాలు తాజా నివేదికలు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నాయి. ఇక విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు తాజాగా వెల్లడయిన నివేదకతో గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. అలానే ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి తాజా నివేదికతో ప్రజలకు స్పష్టంగా తెలిసింది. నివేదికల ప్రకారం ఈ ఏడాది పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
2022 మొదటి 7 నెలల్లో దేశం వ్యాప్తంగా వచ్చిన మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో దాదాపు 45 శాతం పారిశ్రామిక పెట్టుబడులు ఏపీలోనే జరిగాయి. 2022, జూలై చివరి నాటికి భారతదేశానికి రూ.1,71,285 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు రాగా.. ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో 45 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ తాజా నివేదికతో విపక్షాలు చేసే విష ప్రచారానికి ముగింపు లభించినట్లు అయ్యింది.
ఇక 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే.. రాష్ట్ర అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు సీఎం జగన్. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చే వారి కోసం www.apiic.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఏ పారిశ్రామికవ్తేతకైనా ఒకే విధమైన ఆన్‌లైన్ దరఖాస్తు వెసులుబాటు కల్పించారు. భూకేటాయింపులు, ప్లాట్ల అనుమతల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తుతో అన్ని అనుమతులు పొందేలా తీర్చిదిద్దడమే కాక.. ఆ తర్వాత వాటి స్టేటస్ తెలుసుకోవడం కోసం ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు
ఏపీఐఐసీ వెబ్‌సైట్ ద్వారా 14 రకాల సేవలను ఓకే దరఖాస్తుతో పొందే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలానే పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం.. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రాయితీలు ప్రకటించడం, బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిదులు కేటాయించడమే కాక.. సదరు పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటూ… పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేయడమే కాక ఉపాధి కల్పన దిశగా ముందుడుగు వేస్తూ.. రాష్ట్రాని అభివృద్ధిపథంలో తీసుకెడుతున్నారు సీఎం జగన్. ఇందుకు తాజాగా వెల్లడయిన నివేదికలే సాక్ష్యం. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల కారణంగా.. నేడు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.