AP Politics : ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కొత్త సంస్కృతికి తెర తీస్తున్నాయి. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలు చేసే పనులు ప్రతి పక్ష నాయుకులపై చర్యలకు దారి తీస్తుంటే.. ప్రతి పక్షాన్ని దెబ్బతీయటానికి అధికార పక్షం చేసే పనులు పంతాలకు, మంగమ్మ శపథాలకు దారి తీస్తోంది. ప్రతి పక్ష నాయకుడు లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరగటం అన్నది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి దూరంగా ఉంటే.. నేడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ను అసెంబ్లీలో కొన్ని ఇబ్బందులు పెట్టారు. ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే పదేపదే మైక్ కట్ చేస్తుండడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వంటి వాటిపై జగన్ అసెంబ్లీలోనే ప్రశ్నించారు.. ఇందుకు నిరసనగా సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత పాదయాత్ర చేపట్టి అఖండ విజయంతో సీఎంగా అసెంబ్లీకి వచ్చారు.ఇక ఇప్పుడు ఇందుకు కొంత భిన్నంగా జరుగుతోంది.
అసెంబ్లీ తన కుటుంబ సభ్యులపై తప్పుగా మాట్లాడారంటూ ప్రతి పక్ష నేత చంద్రబాబునాయుడు సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. అసెంబ్లీలో అడుగుపెడితే అది సీఎంగానేని శపథం చేసి మరీ వెళ్లారు. ఈ సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. కేవలం కొంతమంది టీడీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారు కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి గవర్నర్ మీదకు విసిరేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాక్‌అవుట్ చేశారు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.