ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తొలి మంత్రవర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. పాత, కొత్త కలయికలతో రెండో మంత్రివర్గాన్ని ప్రకటించారు. సోమవారం వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ జాబితాలో పాతవారు 11 మందికి, కొత్త వారు 14 మందికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రివర్గంలో నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం లభించింది. దీనిపై రోజా ఇప్పటికే సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో.. ఇకమీదట జబర్దస్త్, సినిమా షూటింగుల్లో పాల్గొనని రోజా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: మంత్రి పదవి ఎఫెక్ట్.. MLA రోజా షాకింగ్ నిర్ణయం!
రోజాకు మంత్రి పదవి కన్ఫామ్ అయ్యింది.. ఇక ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారనే దాని గురించి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రోజా వికిపీడియాలో ఆమె ఏపీ హోం మినిస్టర్ అంటూ కనిపించింది. దాంతో రోజాకు హోం మినిస్టర్ పదవి ఖాయమనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అంతేకాక గతంలో కూడా సీఎం జగన్ మేకతోటి సుచరితకు హోం మినిస్టర్ బాధ్యతలు అప్పగించారు. ఈ సారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
ఇది కూడా చదవండి: AP మంత్రివర్గ విస్తరణ.. షాకిచ్చిన మేకతోటి సుచరిత!కొత్త మంత్రి వర్గ జాబితాలో ఉన్న వారిలో విడదల రజనీ, రోజా.. ఇద్దరిలో ఎవరికో ఒకరికి హోం మినిస్టర్ పదవి ఖాయమనే ప్రచారం ఉంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా.. జగన్‌కు సన్నిహితురాలు కావడంతో.. ఆమెకు హోం మినిస్టర్ పదవి పక్కా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని గంటల క్రితం వరకు రోజా వికీపిడియా పేజ్‌లో హోం మినిస్టర్ అన్నట్లుగా చూపించింది. దాంతో ఆమెకు హోం మంత్రి పదవి పక్కా అని రోజా అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దురదృష్టం అంటే ఆ YCP ఎమ్మెల్యేదే.. చివరి నిమిషంలో మంత్రి పదవి చేజారింది!
అయితే వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉండటంతో కొంతమంది కావాలనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇది చూసిన రోజా అనుచరులు మాత్రం.. తమ అభిమాన నాయకురాలికి హోంమంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. రోజాకు హోం మంత్రి పదవి దక్కుతుందో, లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.