హీరోయిన్, ఎమ్మెల్యే రోజా కన్నా కూడా ఫైర్ బ్రాండ్ రోజా అన్న పేరంటేనే ఆమె అభిమానులకు ఎక్కువ ఇష్టం. ముక్కుసూటిగా మాట్లాడటం.. తేడా వస్తే.. ఎంతటి వారినైనా మాటలతో కడిగిపారేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాలకు, సినిమాలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్న సమాజం మనది. అలానే రోజా కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటి రెండు సార్లు ఓటమి పాలయ్యారు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఐరెన్ లెగ్ అన్న విమర్శలు ఎదుర్కొన్న రోజా నేడు ఐరెన్ లేడీగా ఎదిగారు. ఆమె సినీ, రాజకీయ ప్రస్థానం సాగిందిలా..
కుటుంబ నేపథ్యం..రోజా అసలు పేరు శ్రీలత. ఆమె 1971, నవంబర్ 16న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. కొన్నేళ్ల తర్వాత రోజా కుటుంబం హైదరాబాద్ షిప్ట్ అయింది. పద్మావతి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు రోజా. చదువుతోపాటు కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. అలా బీఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రోజా.
ఇది కూడా చదవండి: మంత్రి పదవి ఎఫెక్ట్.. MLA రోజా షాకింగ్ నిర్ణయం!
ప్రేమ తపస్సు చిత్రం చిత్రంకు ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు. ఆ సినిమా తమిళంలో మ్యుజికల్ హిట్. దాన్ని తెలుగులో చేమంతి సినిమాగా డబ్ చేశారు. ఆ మూవీని ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి తెరకెక్కించాడు. కొన్నాళ్లకు రోజా ఆయనతోనే ప్రేమలో పడ్డారు.. పదేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఒక కుమార్తె అన్షు మాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్ ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం..ఇక 2004లో రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. తొలుత టీడీపీలో చేరారు. 2004లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి పై పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. దాంతో విపక్షాలు రోజాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశాయి. ఆ తర్వాత రోజా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు.
ఇది కూడా చదవండి: రోజాకి కీలక శాఖ! హోం మినిష్టర్ కాబోతుందా?
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు రోజా. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడుపై రోజా విజయం సాధించారు. అలానే 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు గాలి భానుప్రకాష్ పై గెలిచారు రోజా.వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా,ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు రోజా. ఏ మాత్రం తేడా వచ్చినా విపక్షాలను తూర్పూరపట్టడంలోనూ.. తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెకు ఎవరు సాటి లేరు. ఇక 2020 నుంచి రెండేళ్ల పాటు ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా పనిచేశారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో జగన్.. ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా రోజా ఎమోషనల్ అయ్యారు.
ఇది కూడా చదవండి: భగ్గుమన్న బాలినేని! మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు!
‘‘నన్ను తెలుగుదేశం వాళ్లు ఐరన్ లెగ్ అన్నారు.. రాజకీయంగా ఎదగనీయకుండా చేశారు.. జగన్ అన్న లీడర్‌గా గుర్తించారు. ఓసీ నుంచి మినిష్టర్ కావడం కష్టం.. తీవ్ర ఒత్తిడిలోనూ నన్ను మంత్రిని చేశారు.. అందుకే మంత్రి పదవిని నాకు ప్రకటించగానే కన్నీళ్లు వచ్చేశాయి. జీవితాంతం జగన్ అన్న వెన్నంటే ఉంటాను’ అంటూ రోజా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఐరెన్ లెగ్ నుంచి ఐరెన్ లేడీగా ఎదిగిన రోజా ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.