ఏపీ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు ఆసక్తికర కామెంట్స్ చేస్తుంటారు. మధ్యలో జనసేన సైతం ప్రభుత్వం పై మాటల యుద్ధం చేస్తుంది. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కంటే జనసేనే ప్రభుత్వంతో పోరాటడుతుందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్య రోడ్ల విషయంలో జనసేన ఓ రేంజ్ విమర్శ గుప్పిస్తుంది. వీటిపై అధికార పార్టీ నాయకులు సైతం అదే స్థాయిలో స్పందింస్తున్నారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిధులు లేకపోవడం వల్లనే రోడ్ల పనులు పెండింగ్ లో ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంకి మంత్రి గుమ్మనూరు జయరాం వెళ్లారు. ఈ క్రమలో రోడ్ల పరిస్థితి గురించి స్థానికులు ప్రస్తావించారు. దీంతో మంత్రి మాట్లాడుతూ.. నిధులు లేకపోవటం వల్ల ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని వివరించారు. నియోజకవర్గంలోని 40 రోడ్లు బాగా లేవన్న మంత్రి తెలిపారు. ఆగస్టు నెలలో రూ.2వేల కోట్లు వస్తాయని చెప్పారు. అవి రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రోడ్డ పరిస్థితిపై స్వయంగా మంత్రే ఇలా మాట్లాడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతోన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ కు నిరసన సెగ కూడా తగిలింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో మంత్రి జయరాంను మహిళలు అడ్డుకున్నారు. మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఆయన చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. తమకు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఈ క్రమంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రగడ జరిగింది. మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.