ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఏపీ రాజకీయాలు మాత్రం అప్పుడే వేడెక్కాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి… విరుచుకుపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేసి.. ట్రోలింగ్‌కు గురైన మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై స్వయంగా స్పందించిన గుడివాడ.. ఓ రేంజ్‌లో సెటైర్లు వేశాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మానవత్వం చాటుకున్న ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
గతంలో ఎయిర్ పోర్టులో గుడివాడ అమర్నాథ్, పవన్ కళ్యాణ్‌తో దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో జనసైనికులు.. మా నేతతో ఫోటో దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకుని.. మురిసిపోయే స్థాయి వ్యక్తులైన మీరు.. ఇప్పుడు మా నాయకుడి మీదనే విమర్శలు చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని అనను అంటూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: AP మంత్రి గుడివాడ అమర్నాథ్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!
అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కారణంగా తనకు వచ్చిన ఇమేజ్‌ను చూసి చాలామంది తనతో ఫొటో తీయించుకున్నారని అమర్నాథ్ తెలిపారు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తనతో ఫొటో తీయించుకున్నారని.. ఆ ఫోటోలో పవన్‌ను చూపిస్తూ ఎవరు చేతులు కట్టుకుని ఉన్నారో చూడండి అన్నారు. తనలాంటి వాడితో ఫొటో తీయించుకునేటప్పుడు వినయం ప్రదర్శించాలని.. అసలు రెండుచోట్ల ఓడిపోయిన వాళ్లతో తానెందుకు ఫొటో తీయించుకుంటాను అని ప్రశ్నించారు. ఇక పవన్ కల్యాణ్ తనతో ఎప్పుడు ఫొటో తీయించుకున్నారో గుర్తులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ వ్యాఖ్యలపై అటు వైసీపీ అభిమానులు, ఇటు పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేసుకుంటున్నారు. మరి గుడివాడ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మంత్రి అమర్నాథ్‌పై RGV ట్వీట్.. ఈ వయసుకే ఇంత సాధిస్తే అంటూ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.