రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించగా.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం కనిపిస్తోంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. అన్ని స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. మిగతా వాటిల్లో కూడా విజయం దిశగా అడుగులు వేస్తోంది. అయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో పోటాపోటి పరిస్థితి నెలకొంది. ఏపీలో మూడు గ్రాడ్యయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం వాటి కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై ఏకంగా 20 వేలకు పైగా భారీ ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం.
మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ భారీ ఆధిక్యం దిశగా పరుగులు తీస్తోంది. ఇక్కడ బరిలో నిలిచిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఐదవ రౌండ్ ముగిసేసరికి తమ సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి మీద భారీ అధిక్యం అనగా 16,929 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో టీడీపీ భారీ అధిక్యం సాధించగా.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా.. పరిస్థితి తారుమారు కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అలానే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లెక్కింపు పూర్తికాగా.. వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపిన అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి సుమారు 2వేల ఆధిక్యంతో విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచి అభ్యర్థి రామచంద్రారెడ్డి 169 ఓట్లతో గెలుపొందారు. మూడో ప్రాధాన్యతా ఓటుతో ఆయన విజయం సాధించారు. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఆంధ్ర ప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ అప్డేట్
2 స్థానాల్లో టీడీపీ పూర్తి ఆధిక్యం, 1 స్ధానంలో స్వల్ప మెజారిటీతో వైఎస్సార్సీపీ #MLCElectionsInAP #MlcElectionsresults #MLCElectionCounting pic.twitter.com/vk9igBrK0Y
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2023