ఇటీవల టీడీపీ నేతలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ " జగనాసుర రక్త చరిత్ర" పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పుస్తకంపై స్పందిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటకీ అప్పుడే ఆ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇటీవలే జగన్ మోహన్ రెడ్డిపై “జగనాసుర రక్త చరిత్ర” అనే పుస్తకం విడుదల చేశారు. అలానే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో జగన్ ప్రమేయం ఉందంటూ టీడీపీ నేతలు ఆ పుస్తకంలో ఆరోపించారు. అయితే దానిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ పుస్తకం ముద్రించిన టీడీపీ నేతలకు దానిపై పేరు వేసుకునే ధైర్యం లేదంటూ విమర్శించారు. టీడీపీ నేతల డ్రామాలను చూసి తట్టుకోలేక పోతున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
శనివారం మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడిపై, టీడీపీ ముఖ్యనేతలపై తీవ్ర స్థాయి విరుచక పడ్డారు. దేవుడ్ని, ప్రజలను నమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డిని ఎవరు ఏమి చేయలేరంటూ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఆడవారిని పెట్టుకుని రాజకీయాలు చేసే నీచులతో పోటీ చేయాల్సి రావడం వైసీపీ దురదృష్టమని ఆయన అన్నారు. ఇంకా “జగనాసుర రక్త చరిత్ర” అనే పుస్తకం విడుదల చేసిన టీడీపీ నేతలపై బుల్లెట్ లాంటి ప్రశ్నలను పేర్నినాని సంధించారు.
ఆయన మాట్లాడుతూ..” టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరికొందరు నేతల కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద ఓ 20 పేజీల విషపు రాతలు రాసి.. దానికి ‘జగనాసుర రక్త చరిత్ర’ అని పేరు పెట్టారు. టీడీపీ ఓ అంతర్జాతీయ పార్టీ అయినట్లు, దానికి ఏపీ ఓ అధ్యక్షుడూ, మరొక రాష్ట్రానికి ఇంకొ అధ్యక్షుడు. ఆ పార్టీ బతికి ఉందే ఏపీలో.. మళ్లీ దీనికి ఓ అధ్యక్షుడు అంట. వీరి డ్రామాలు చూడలేక చస్తున్నాము. ఆ పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. ఇక వీరందరూ విడుదల చేసిన ఆ పుస్తకం పై ఎక్కడ టీడీపీ పేరు, కానీ రాసినవాళ్ల పేరు కానీ ప్రచురించలేదు.
నిజంగా అందులో రాసిన తప్పుడు రాతలే సత్యాలు అయి ఉంటే.. మీ పార్టీ పేరు, మీ పేరు ప్రచురించలేదు ఎందుకు?. జగన్ మోహన్ రెడ్డి పై విషం చిమ్మడానికే ఈ ప్రయత్నం చేశారే తప్ప అందులో నిజం లేదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఆ పుస్తకం పై మీ నాయకుడి పేరు, పార్టీ పేరు ముద్రించండి. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ప్రభుత్వం మీదే ఉంది కదా?. ఆ సమయంలో ఆయన కూతురి స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు. వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ఎఫ్ఆర్ లో ఎందుకు చేర్చాలేదు?. ఈ చంద్రబాబు నీచ రాజకీయాలకు ఆడవారిని కూడా బలి చేస్తున్నాడు. వారు విడుదల చేసిన ఈ పుస్తకంలో రాజకీయాలకు సంబంధంలేని భారతమ్మ పేరును రాశారు.
ఇంతకంటే నీచం మరొకటి ఉంటుందా. తన ఇంటి ఆడవాళ్ల జరుగుతేనేమో మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీళ్లు పెట్టుుకుంటారు. మరి.. మీ ఆడవారి లాంటి వారే కదా ఇతర కుటుంబంలోని మహిళు. అంటే వారికి మనోభావాలు ఉండవా, వారికి గౌరవ మర్యాదలు ఉండవా?. చంద్రబాబు జీవితం అంతా ఆడవారిని అట్టుపెట్టుకునే సాగించారు. అంతేకాక ఇప్పుడు పాదయాత్ర పేరు చెప్పుకుని స్క్రీప్ట్ రాసి మరి.. లోకేశ్ తో సీఎం జగన్ ను తిట్టిస్తున్నాడు” అని పేర్ని నాని అన్నారు. మరి.. టీడీపీ నేతలపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.