రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు చాలా సహజం. అయితే అవన్ని పార్టీలపరంగా మాత్రమే. నిజజీవితంలో వేర్వురు పార్టీల నాయకులు మధ్య మంచి సంబంధాలుంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలు ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా మరోకటి వెలుగు చూసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మీద ప్రశంసలు కురిపించారు. విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అంటూ అభినందించారు. ప్రస్తుతం ధర్మాన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మంత్రి పదవి పోతే నా విశ్వరూపం చూస్తారు: కొడాలి నాని
విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల గురించి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కరెంటు రేట్లు నామినల్‌గా పెంచితే టీడీపీ నాయకులు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కనీసం వారు అసెంబ్లీకి హాజరు కారని.. ఒకవేళ వచ్చినా.. ఆ కాసేపు కూడా చిడతలు వాయించుకుంటూ కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కోరిక నెరవేర్చిన CM జగన్!అంతేకాక..‘‘ప్రతిపక్షం పాలక పక్షం ఒక బండికి రెండు చక్రాల్లాటివి. ఆ రెండిట్లో ఒక చక్రం లేకపోయినా బండి సాఫీగా నడవదు. నో డౌట్ చంద్రబాబు గారు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి నేనేం కాదనట్లేదు. 14 ఏళ్లు ఆ ఆరోజులకు తగ్గట్లుగా ఆయన పాలించారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పరిపాలన చేస్తుంటే దాన్ని అభినందించలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఇలా ఆలోచన లేని మాటలు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నాయి. మూడేళ్ల నుంచి ప్రజలు మాకు బ్రహ్మాండమైన ఫలితాలను అందిస్తున్నారు. జగన్ పాలన ప్రజలకు మేలు చేకూర్చేది’’ అన్నారు ధర్మాన. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మీతో ఇదే నా చివరి సమావేశం.. పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.